ఇందిరమ్మ కాలనీలో తాగునీటి కష్టాలు.. 10 రోజులుగా మిషన్ భగీరథ నీరు బంద్

49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో గత పది రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యపై సంబంధిత డీఈని కాలనీవాసులు ప్రశ్నించగా, తమ కాలనీలో అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నాయని, ఇళ్లకు ఇంటి నంబర్లు ఉన్నాయా? అంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారని స్థానికులు తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధికారులు ఎదురుదాడి ధోరణిలో మాట్లాడటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడంపై కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాలనీలో...