బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంది..CM రేవంత్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓట్ల తొలగింపు కుట్రలకు తెరలేపిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కొడంగల్ నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌ కు గుర్తింపు వచ్చిందని, ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో నాటకాలు ఆడుతూ.. కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహంతో గెలిచారని, ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో...