జనసేన అధ్యక్షురాలిగా కొండా సురేఖ ⁉️

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆమె జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.కాంగ్రెస్‌ పార్టీలో తనకు ఎదురైన పరిణామాలపై కొండా సురేఖ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆమె భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జనసేనలోకి కొండా సురేఖను ఆహ్వానించి, తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించే అంశంపై చర్చ జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.జనసేన తెలంగాణలో పార్టీని మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో, రాజకీయంగా సీనియర్‌...