రైస్ మిల్లర్ల మహా ధర్నా: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏకశిలా పార్క్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మిల్లర్లు మాట్లాడుతూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులను నిలిపివేయాలని, రన్నింగ్ మిల్లర్లపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. CMR అగ్రిమెంట్‌ను ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా రూపొందించాలని కోరారు. రా రైస్‌కు క్వింటాల్‌కు రూ.150, బాయిల్డ్ రైస్‌కు రూ.200 మిల్లింగ్ ఛార్జీ చెల్లించాలని, పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.9గా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్, డైయేజ్, కస్టోడియన్ ఛార్జీలను చెల్లించాలని కోరారు.డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం...