108 గుమ్మడికాయలతో మహంకాళి అమ్మవారికి అలంకరణ
జనగామ: శ్రావణ శుక్రవారం చివరి వారం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 108 గుమ్మడికాయలతో అత్యంత భక్తిశ్రద్ధలతో అలంకరించారు. చివరి శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. మహిళలు పూజా సామగ్రితో ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.