ఎనిమిదో రోజుకు చేరిన జ్ఞానేశ్వరి గాలింపు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ ఎలాంటి ఆధారం లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు శునకం మృతి చెందడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. కిడ్నాప్‌ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలూ వినియోగించుకోవాలని...