వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు - విజయవాడలో DMDC ఏర్పాటు

రాష్ట్రంలో వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించి సమర్థంగా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకోసం 'డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్' (డీఎండీసీ)ను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతతో పనిచేసే ఈ కేంద్రం ద్వారా వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు అందించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగుపడనున్నాయి. డీఎండీసీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం : డీఎండీసీ ఏర్పాటుకు తొలి ఏడాది రూ.5.73 కోట్ల వ్యయం అంచనా వేయగా, అనంతరం ప్రతి ఏడాది రూ.3.7 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ కేంద్రానికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం...