అయోధ్య విరాళాల వివాదంపై సిట్ ఏర్పాటు- రామమందిర ఉద్యోగి ఇంట్లో రూ.10 లక్షలు స్వాధీనం!

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు చేయడానికి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిఫార్సు మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి సర్కార్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి పోలీసులు ఒక రామమందిర ఉద్యోగి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన కానుకలు (విరాళాలు) నిర్వహించే బాధ్యత కలిగిన ఆ ఉద్యోగిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆవు పేడ కుప్పలో డబ్బు పోలీసులు ఆ ఉద్యోగి ఇంటి నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత నగదు బీరువాలో లభించగా, మిగిలినది...