ఈసారి గవర్నమెంట్ స్కూల్​ యూనిఫాం మారింది - కొత్తవి ఎలా ఉండనున్నాయంటే?

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న ఏకరూప దుస్తుల రంగులు, డిజైన్లు మారనున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో స్వల్పంగా కొన్ని మార్పులు చేశారు. గతేడాది వేసవి సెలవుల్లోనే ఏకరూప దుస్తులు సిద్ధం చేసి, పాఠశాలల పునః ప్రారంభం రోజున అందజేశారు. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా పాఠశాలలకు వస్త్రాలు సరఫరా అవ్వలేదు. అయితే ఈసారి నీలం రంగుతో ఉన్న డిజైన్లతో బాల బాలికలకు ఏకరూప దుస్తులు అందించనున్నట్లు ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వస్త్రాలు ఎలా ఉన్నాయంటే? : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బాలురకు నీలం రంగులో ఉన్న...