వచ్చే నెల నుంచి తెలంగాణ సీఎస్​ ఎవరు? - ముఖ్యమంత్రి మనసులో ఏముంది?

వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? రామకృష్ణారావును మరోసారి పొడిగిస్తారా? లేక కొత్తవారిని నియమిస్తారా? అనే అశం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రస్తుత సీఎస్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్నందున ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, జయేశ్​ రంజన్, వికాస్‌రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన కుర్చీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎస్​లు : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి కుర్చీలో ఎవరు ఉండబోతున్నారన్న అంశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది....