ఇన్స్టా, ఫేస్బుక్ ప్రేమలు" - మీరూ ఈ మూడు దశలను దాటేశారా?
పంజాబ్లోని పటియాలాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఆమె మాజీ ప్రియుడు 20సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తానూ అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆఫీసు పనివేళల్లో తమ కళ్లెదుట జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపేందుకు సహోద్యోగులు విఫలయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వాటిపై ఆరా తీస్తే సోషల్ మీడియాలో పరిచయాలు కనిపిస్తుంటాయి. ఇన్స్టా, ఫేస్బుక్లో చిగురించిన స్నేహం ప్రేమగా మారి విడిపోయిన తర్వాత హత్యలకు దారితీసినట్లుగా కనిపిస్తుంటుంది. అదెలా సాధ్యం? ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత అంత ఘోరంగా ఎందుకు హతమారుస్తారు? సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయంతో ప్రేమ ఎలా సాధ్యం? ప్రేమైనా, పెళ్లైనా ముందూ, వెనుక ఎన్నో ఆలోచిస్తాం. కానీ,...