శివారాధన చేస్తే కేతు గండాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయా?
నవగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి నవగ్రహాలతో పాటు శివుని కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. శివారాధనకు సోమవారంతో పాటు శనివారం కూడా విశిష్టమైనదే! అందునా ఆ శనివారం మాస శివరాత్రితో కలిసి ఉంటే అది మరీ ప్రత్యేకం. అత్యంత అరుదుగా వచ్చే శనివారం మాస శివరాత్రి రోజు చేసే శివారాధనకు ఎలాంటి ఫలితం ఉంటుంది? అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? శివుని పూజకు మాస శివరాత్రి ఎందుకంత ప్రత్యేకం? ఈ వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి. మాస శివరాత్రి అంటే ఏమిటి? ప్రతినెలా ఒక మాస శివరాత్రి వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు...