"శంభాల గ్రామంలో కల్కి జననం" - తల్లిదండ్రులు హరిప్రియుడు-దేవప్రభ!
త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడి అవతారమెత్తిన శ్రీమహావిష్ణువు కలియుగంలో కల్కి అవతారంలో జన్మిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుపురాణం, పద్మపురాణాల్లో ఇదే విషయాన్ని వెల్లడించినా, ఈ భూగోళంపై కల్కి అవతారం ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది? ఏ ప్రాంతంలో ఎవరికి జన్మిస్తాడు? అనే సందేహాలు అనేకం ఉన్నాయి. శ్రీరాముడి తల్లిదండ్రులు దశరథుడు కాగా తల్లి కౌసల్యాదేవి, అదే విధంగా శ్రీకృష్ణుడి తల్లి దేవకి కాగా, తండ్రి వసుదేవుడు అని తెలిసిందే. మరి కల్కి అవతార పురుషుడి తల్లిదండ్రులు ఎవరు? వారి పేర్లేమిటి? కల్కి అవతారం, జన్మ రహస్యాలపై కొందరు జ్యోతిష్యులు, పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం ఈ కథనం. విగ్రహం లేని "శివాలయం"! - కాకరకాయ...