రాగల ఏడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక

రాగల ఏడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిన హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుతాయని పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,...