బాకీతో స‌హా మొత్తం ఆడబిడ్డ‌ల‌కు ఇయ్.. నేను రాజీనామా చేస్తా : కేటీఆర్

రేవంత్ రెడ్డి కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తా అంటుండు.. నువ్వు కోటీశ్వ‌రుల‌ను చేసుడు దేవుడెరుగు.. నువ్వు ముందైతే ల‌క్షాధికారులు చెయ్‌. ఒక్కొక్క ఆడ‌బిడ్డ‌కు ల‌క్షా 50 వేలు ఇస్తా అని చెప్పిన‌వ్‌ క‌దా.. నువ్వు కోటి మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని రేవంత్ రెడ్డికి చెబుతున్నాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్య‌నేతలు హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలో ఎస్ఐఆర్‌, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా...