హెల్తీ పుడ్ నిజంగానే అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయా..? నిపుణులు ఏమంటున్నారు..?
నేటి వెల్‌నెస్ ట్రెండ్‌లో హెల్తీ ఫుడ్ అనే పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఎన్నో ఆహార పదార్థాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రోటీన్ బార్లు, ఫ్లేవర్డ్ యోగర్టులు, సూపర్‌ఫుడ్ స్మూతీలు, విత్తనాలు, సప్లిమెంట్లతో నిండిన పానీయాలు ఆరోగ్యకరమైన ఎంపికలుగా ప్రచారం పొందుతున్నాయి. అయితే, పేగుల ఆరోగ్యానికి వస్తే ప్రతి హెల్తీ ఆహారం అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరంలోని మైక్రోబయోమ్ భిన్నంగా ఉండటంతో ఆహారాలపై ప్రతిస్పందన కూడా వేరుగా ఉంటుంది. పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, జీవక్రియలు, వాపు నియంత్రణ వంటి అనేక కీలక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఒకరికి మేలు చేసే ఆహారం...