నేను గే కాదు.. ఆ వార్త పూర్తిగా అబద్ధం … వైరల్ పుకార్లపై మౌనీ రాయ్ ఘాటు స్పందన

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ పుకారుపై తాజాగా స్పందించారు. ‘నేను గే’ అని బహిరంగంగా ప్రకటించానంటూ గతంలో ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ఆమె స్పష్టత ఇస్తూ, అవి తన కెరీర్‌లో విన్న అత్యంత విచిత్రమైన పుకార్లలో ఒకటని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మౌనీ రాయ్, తాను ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని, ఆ వార్త పూర్తిగా కల్పితమని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. నిజం కాని విషయాలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో ఈ ఘటన...