ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్‌ ఖరారు.. జూలై 4న షురూ.. 6, 7 తేదీల్లో అంతిమయాత్రలు.. 9న ఖననం..

: ఇరాన్ (Iran) దేశాన్ని సుదీర్ఘ కాలంపాటు పరిపాలించిన మాజీ సుప్రీం లీడర్ (Ex Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathullah Ali Khamenei) అంత్యక్రియల అధికారిక షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల (జూలై) 4 నుంచి రాజధాని టెహ్రాన్‌ (Tehran) లో ఈ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఖమేనీ సంస్మరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ప్రధాన కమిటీ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కమిటీ ప్రకటన ప్రకారం.. జూలై 4, 5 తేదీల్లో టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇమామ్ ఖమేనీ ముసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ పార్థివ దేహానికి వీడ్కోలు వేడుకలు...