దేశ ఆర్థికవ్యవస్థపట్ల తమ శ్రద్ధను రాహుల్‌గాంధీ గుర్తించలేకపోతున్నారు : నిర్మలా సీతారామన్‌

దేశ ఆర్థికవ్యవస్థ, కుటుంబాల సంక్షేమం విషయంలో తాము చూపిస్తున్న శ్రద్ధను కాంగ్రెస్‌ అగ్రనేత (Congress Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తించలేకపోతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. ఆయన లోక్‌సభ (Lok Sabha) లో మాట్లాడిన ప్రతిసారీ కేవలం విమర్శలకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకునే క్రమంలో దేశం సాధించిన విజయాలను తక్కువ చేసి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో వికసిత్‌ భారత్‌ సంకల్ప సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘భారీ విపత్తు ముంచుకొస్తోందని, రాబోయే కొద్ది వారాల్లో అంతా కుప్పకూలిపోతుందని రాహుల్‌ గాంధీ తరచూ అంటుంటారు. ఆయన చెబుతున్నట్లుగా దేశంలో...