తెలంగాణలో మోగిన బడి గంట - బ్రేక్ ఫాస్ట్తో తెరుచుకున్న పాఠశాలలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్ పాఠశాలలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థులకు టీచర్లు, సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్ను అందించారు. ఇంటర్, పాఠశాల విద్యార్థులు కలిపి 1.44 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజే పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజ్‌భవన్ బడిలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి పొన్నం నేలపై...