థియేటర్లలో సందడి చేస్తున్న కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత'- ఆ రాష్ట్రంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన సీఎం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'భారత్ భాగ్య విధాత' జూన్ 12న రిలీజై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో ఇది తెరకెక్కింది. అయితే రిలీజ్ తర్వాత కూడా కంగనా ఈ సినిమాను ఎక్కువగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పలు రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు దక్కింది. మరి అది ఏ రాష్ట్రంలో అంటే? స్పెషల్ స్క్రీనింగ్ తాజగా మూవీటీమ్ చండీగఢ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఈ చిత్ర ప్రదర్శనకు హీరోయిన్​ కంగనా రనౌత్​తోపాటు, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్...