సోమవతి అమావాస్య రోజు శివారాధన చేస్తే చాలు- ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం!

పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు సోమవారమని తెలిసిందే! అలాగే శనివారం, అమావాస్య రోజులు కూడా శివుని ఆరాధనకు శ్రేష్ఠమైనవని శివ పురాణం చెబుతోంది. ముఖ్యంగా అమావాస్య రోజు శివయ్యను పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు. ఇక సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజు చేసే శివారాధన మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా కోటిరెట్ల అధిక ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. సూర్య గ్రహణంతో సమానమైన సోమవతి అమావాస్య అంటే ఏమిటి? ఆ రోజు మహాదేవుని ఎలా పూజించాలి? పూజ ఫలం ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమవతి అమావాస్య అంటే? సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య...