వరంగల్‌లో ‘కళ్యాణమస్తు ’ సామూహిక వివాహాల పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్, జూన్ 15 సుదీక్ష న్యూస్ :: శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించనున్న “కళ్యాణమస్తు ” సామూహిక వివాహాల పోస్టర్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని వివాహాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి యువతకు వివాహాలు జరిపించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 24న ఉదయం 8 గంటల నుంచి సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.వివాహం చేసుకోవాలనుకునే వధూవరులకు 18 సంవత్సరాలు నిండివుండాలని, అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని...