ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒప్పో సంచలనం..
| ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీగా ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే Oppp Find X10 Pro మొబైల్‌ను తీసుకురాబోతుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీకయ్యాయి. దీనిప్రకారం ఈ మొబైల్ డ్యూయల్ 200మెగాపిక్సెల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో పాటు ఆసక్తికరమైన ఫీచర్లతో ఈ మొబైల్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సోషల్‌మీడియా వేదిక వీబోలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒప్పో ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ ఫోన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. గతంలో వెలుగులోకి వచ్చిన వివరాలు, తాజా వ్యాఖ్యలను పోల్చి చూడగా...