తలస్నానం చేశాక జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేస్తున్నారా?

తలస్నానం చేసిన వెంటనే జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేయడం చాలామందికి అలవాటు. జుట్టు తొందరగా ఆరిపోతుందనే ఉద్దేశంతో అమ్మమ్మల కాలం నుంచి ఇదే టెక్నిక్‌ను వాడుతున్నారు. కానీ అది మంచి అలవాటు కాదని.. వెంట్రుకలు చిట్లిపోయి, రాలిపోవడానికి అదే ప్రధాన కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల తడిగా ఉన్న సమయంలో జుట్టు అత్యంత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టును రుద్దడం, బలంగా పిండి తుడవడం లేదా టవల్‌తో గట్టిగా చుట్టేయడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి. తడి జుట్టు ఎందుకు సున్నితంగా ఉంటుంది జుట్టు వెలుపలి పొరను క్యూటికల్...