నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!

: తెలుగు మాసాల్లో మూడవ మాసమైన జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం ఏర్పడినందున నిజ జ్యేష్ఠ మాసంలోనే అన్ని పర్వదినాలు, పుణ్య తిధులు జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా నిజ జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఈ మాసంలో రానున్న పుణ్య తిధులు, పండుగల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం విశిష్టత తెలుగు పంచాంగం ప్రకారం పౌర్ణమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించే మాసం కాబట్టి ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు వచ్చింది. బ్రహ్మ దేవునికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసంలో నెల రోజుల పాటు గోధుమ...