సీజనల్ హెయిర్ ఫాల్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!
సీజన్ మారిందంటే మొదట ప్రభావం పడేది శిరోజాలపైనే! ఇలాంటప్పుడు జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొన్ని ఆహార పదార్థాలు ఈ విషయంలో మనకు సాయపడతాయని తెలుసా? వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తీవ్రం కాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం! పసుపు : ఇందులో ఉండే కర్క్యుమిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుందట. ఈ క్రమంలో కురులు ఆరోగ్యంగా ఉండాలని కొబ్బరినూనె ఎలా రాసుకుంటామో.. అలాగే, పసుపు ను కూడా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, లారిక్ యాసిడ్ కురులను దృఢంగా చేస్తాయని సూచిస్తున్నారు. అవిసెలు :...