గ్లామర్‌కు గుడ్‌బై ,యాక్షన్ మోడ్‌లో కాజల్ అగర్వాల్ ..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కాజల్, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా భిన్నమైన పాత్రలపై దృష్టి సారిస్తోంది. గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ, కథకు ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తొలిసారి ఓటీటీ ప్రపంచంలో అడుగుపెట్టబోతోంది. ‘స్వామి రారా’ ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ‘విశాఖ’ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘విశాఖ’లో కాజల్...