‘పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన చురుకైన మాట‌ల‌తో, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకవైపు వరుస టీవీ షోలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కడ కనిపించినా ఆమె పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 33 ఏళ్ల వయసులో ఉన్న శ్రీముఖి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి...