వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే..
శ్రీలంకలోని దాంబూలా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనూహ్య పరిణామాలకు వేదికైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ ఓటమి పాలైనప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడిని తోసేయడం వెనుక అసలు కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. గెలుపు కోసం భారత్‌కు 17 పరుగులు అవసరమయ్యాయి. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుగాథస్ మథులన్ వేసిన సూపర్ ఓవర్‌లో చివరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్...