ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ 2026:
స్పోర్ట్స్ డెస్క్: ఎఫ్ ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో భారత్ సెమీస్‌కు చేరింది. ఇవాళ(మంగళవారం) ఆక్లాండ్ నగరంలోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్‌లో జరిగిన పూల్- ఎ మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో జపాన్‌ను ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ సలీమా టెటే 33వ నిమిషంలో, ఫార్వర్డ్ లాల్‌రెమ్‌సియామి 49వ నిమిషంలో గోల్స్ చేశారు. ప్రత్యర్థి జట్టులో హిరామిట్సు 35వ నిమిషంలో గోల్ చేసింది. తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు కూడా కొంతసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని, గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నాయి. అయితే విరామ సమయం వరకు కూడా ఏ జట్టు గోల్ చేయలేదు. మూడవ...