పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
వరంగల్, జూన్ 16 సుదీక్ష న్యూస్ :: సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న సుఖినోభవంతు ట్రస్ట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో చింతల్ చంద్రవదన కాలనీలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన బ్యాగులను అందజేసి వారి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రత్నప్రభ, నిర్మల, సత్యనారాయణ రెడ్డి, సత్యవతి, రమాదేవి, సునీత పాల్గొని విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. అలాగే కాకతీయ రుద్రమాంబ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు భైరవైన సరోజనా యాదవ్, రజియా సుల్తానా తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత ఎనిమిదేళ్లుగా సుఖినోభవంతు ట్రస్ట్ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఒంటరి...