రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంక

వరంగల్ ,జూన్ 16 సుదీక్ష న్యూస్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంకను మంగళవారం తెలంగాణ రైతు సంఘం నాయకులు కలిసి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య ఆధ్వర్యంలో పలువురు రైతు నాయకులు మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలను విక్రయించే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీటి సౌకర్యం, రైతుల కోసం విశ్రాంతి భవనాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత భోజన వసతి, పంటల నాణ్యత నిర్ధారణ, రోజువారీ పంటల ధరలను ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే...