మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలి: సీఐటీయూ నాయకులు
కాజీపేట, జూన్ 16 (సుదీక్ష న్యూస్): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని, మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ మున్సిపల్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు కార్మికులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జూన్ 18, 19 తేదీలలో కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జూన్ 22న జిల్లా...