గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరించాయి: జువారి రమేష్

వరంగల్, జూన్ 16 (సుదీక్ష న్యూస్): వరంగల్‌లోని తమ్మెర భవనంలో తెలంగాణ గిరిజన సమాఖ్య వరంగల్ జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి జువారి రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే బాషమియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువారి రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ట్రైకార్ రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గిరిజన సమాఖ్య నూతన జిల్లా కమిటీని...