ఖమ్మం బాలికపై అత్యాచారం ఘటనకు నిరసనగా వరంగల్‌లో రజక సంఘాల ర్యాలీ

వరంగల్, జూన్ 16 సుదీక్ష న్యూస్ : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల రజక బాలికపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ తెలంగాణ రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా సాగిన సంఘ నాయకులు, సభ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఎండి గౌస్ పాషాపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష, మరణదండన విధించాలని కోరారు. రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు...