ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలల పనివేళల్లో మార్పు
హనుమకొండ, జూన్ 16 (సుదీక్ష న్యూస్):ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్న కళాశాలల పని వేళలను తాజా నిర్ణయం ప్రకారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేశారు. ఈ నిర్ణయం పట్ల టిగారియా (TIGARIA) ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, సొసైటీ సెక్రటరీ కంభంపాటి శారద, ఓఎస్డీ...