ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే

గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వరంగల్ జూన్ 16 సుదీక్ష న్యూస్ : వరంగల్ లక్ష్మీపురం భూపోరాట కేంద్రంలో మంగళవారం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ సాంబమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి నేడు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం...