నాన్న‌ని త‌ల‌చుకొని వెక్కి వెక్కి ఏడ్చిన‌ ఏవీఎస్ కుమార్తె శాంతి..

ఫాదర్స్ డే సందర్భంగా ప్రసారంకానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రత్యేక ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయనుంది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ ఏవీఎస్ కుమార్తె శాంతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయిన క్షణాలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఏవీఎస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి ప్రాణాలను కాపాడేందుకు శాంతి తన లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే అనంతరం ఏవీఎస్ మరణించడంతో ఆమె కొంతకాలం ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ సీరియల్స్, టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలతో ప్రేక్షకుల...