చరిత్ర సృష్టించిన అర్జెంటీనా స్టార్..
అర్జెంటీనా ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీచరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఇక మెస్సీ ఖాతాలో మరో రికార్డు పడింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమానంగా నిలిచాడు. జర్మనీ ఫుట్‌బాలర్ క్లోస్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు అతని రికార్డును మెస్సీ సమం చేశాడు.ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న మెస్సీ.. 200వ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. 8 సార్లు బాలన్ డీఓర్ అవార్డు...