థియేటర్లోకి రాకముందే లాభాల్లోకి..
టాలీవుడ్ నటి సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ యాక్షన్ డ్రామా, రిలీజ్‌కు ముందే పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసుకొని లాభాల బాట పట్టింది. ఈ విషయాన్ని ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై చిత్ర నిర్మాత హిమాంక్ దువ్వూరు అధికారికంగా ప్రకటించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య బడ్జెట్‌తో నిర్మించారు. అయితే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్) హక్కులకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడటంతో,...