ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు..
పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది. పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకు స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు పార్టీ ఎంపీ, పార్లమెంటరీ నేత అరవింద్ సావంత్ తెలిపారు. శివసేన యూబీటీతో అనుబంధం కలిగిన ఏ చీలక వర్గానికి కానీ, తిరుగుబాటు వర్గం లేదా స్వతంత్ర గ్రూపునకు ఎలాంటి గుర్తింపు, హోదా, సౌకర్యం, ప్రత్యేక హక్కులు, గుర్తింపు ఇవ్వరాదని ఆ లేఖలో స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు.ప్రత్యేక హోదా కోరుతూ...