అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

హనుమకొండ, జూన్ 17 (సుదీక్ష న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అరుదైన జన్యుపరమైన డి.ఎన్.డి వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. హనుమాన్‌నగర్‌లోని నిరంజన్ నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు, వస్త్రాలను అందించి ఆశీర్వదించారు. చిన్ననాటి నుంచి...