ఉత్కంఠభరిత మ్యాచ్లో ఘానా విజయం- 8ఏళ్ల తర్వాత కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ

2026 ఫిఫా వరల్డ్​కప్​లో ఘనా బోణీ కొట్టింది. తాజాగా టొరంటో స్టేడియం వేదికగా పనామాతో జరిగిన మ్యాచ్​లో 1-0 తేడాతో ఘానా జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాలేబ్ యిరెంకి చివరి నిమిషంలో గోల్ కొట్టడంతో ఘనా జట్టుకు విజయం ఖరారైంది. వాస్తవానికి మ్యాచ్ ఆరంభంలోనే పనామా జట్టుకు గోల్ సాధించే అవకాశం వచ్చింది. ఆ జట్టు ఆటగాడు అమీర్ మురిల్లో కొట్టిన షాట్​తో బంతి క్రాస్, ఏరియాలో ఉన్న సెసిలియో వాటర్‌మన్‌కు చేరింది. కానీ ఆ గోల్​ను ప్రత్యర్థి జట్టు ఘానా గోల్​ కీపర్ లారెన్స్ అటి జిగీ ఆ బంతిని సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో పనామా తొలి గోల్...