ప్లాస్టిక్ రహిత మార్కెట్లే లక్ష్యంగా ముందుకు సాగాలి
ప్రత్యామ్నాయ బ్యాగుల ప్రత్యేక స్టాల్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి హనుమకొండ, జూన్ 18 సుదీక్ష న్యూస్ : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో హన్మకొండ ఎక్సయిజ్ కాలనీ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన జూట్, క్లాత్ మరియు బయోడిగ్రేడబుల్ బ్యాగుల ప్రత్యేక స్టాల్‌ను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల...