ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
ఎస్‌ఐఆర్-2026పై అవగాహన కల్పించేందుకు 2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి చాహాత్ బాజ్‌పాయి హనుమకొండ, జూన్ 18 సుదీక్ష న్యూస్ : ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి చాహాత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్-2026పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2కె రన్‌ను హనుమకొండ అదాలత్ సర్కిల్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద...