సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా – ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రత్యేక కార్యక్రమాలు
హనుమకొండ, జూన్ 18 (సుదీక్ష న్యూస్): సైకిల్ వాకర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా–303 ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో గత పది సంవత్సరాలుగా ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువులు తెలిపారు.ఈ సందర్భంగా యోగా గురువు జంగ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. “అందరికీ ఆరోగ్యం” అనే లక్ష్యంతో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.రాబోయే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఉదయం...