18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించడం గొప్ప సేవ : సీపీ సంప్రీత్ సింగ్
వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్): కోయ, బలిజ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన 18 జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించడం గొప్ప సామాజిక సేవ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సామూహిక వివాహాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన జంటలకు బంగారు పుస్తెలు, మట్టెలు తదితర వివాహ సామగ్రిని అందించి వివాహాలు జరిపించడం అభినందనీయమని పేర్కొన్నారు. శివానందగురు కల్చరల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ సందర్భంగా శివానందగురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ, ఈ...