అజంజాహి మిల్లు కార్మికులకు 200 గజాల స్థలాలు ఇవ్వాలి

కుడా భూముల వేలం వెంటనే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్): అజంజాహి మిల్లు కార్మికులకు హామీ ఇచ్చిన 200 గజాల స్థలాలను వెంటనే కేటాయించి, ఈ నెల 25న నిర్వహించనున్న కుడా భూముల వేలంపాటను రద్దు చేయాలని కాశిబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు రాజకీయ, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 2002లో అజంజాహి మిల్లు మూతపడిన సమయంలో 452 మంది కార్మికుల్లో 134 మందికి మాత్రమే స్థలాలు కేటాయించారని, మిగిలిన 318 మంది...