మత్తు పదార్థాల నియంత్రణలో డ్రగ్స్ కంట్రోల్ టీం పనితీరు అభినందనీయం : సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం పనితీరు ప్రశంసనీయమని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. 2024 జూలై 15 నుంచి 2026 జూన్ 16 వరకు ప్రత్యేక బృందం చేపట్టిన చర్యల ద్వారా 192 కేసులు నమోదు చేసి, 403 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో 1,241 కిలోలకుపైగా గంజాయి, 1.53 కిలోల ఓపియం, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్‌తో పాటు మొత్తం రూ.8.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 601 మొబైల్ ఫోన్లు, 63 ద్విచక్ర వాహనాలు, 8...